Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు..
- వక్ఫ్ బిల్లుపై చర్చ కొనసాగించాలని జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఆందోళనలు..
- అసెంబ్లీ ప్రాంగణంలో కొట్టుకున్న ఆప్- పీడీపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు..
- అసెంబ్లీలో గందరగోళంతో సభను వాయిదా వేసిన స్పీకర్ అబ్దుల్ రహీమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని జమ్మూకశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో గత మూడు రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతుంది. అయితే, ఇవాళ (ఏప్రిల్ 9న) కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. దీంతో శాసన సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీలో లోపల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యేలు.. ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు.
Read Also: Thopudurthi Prakash Reddy: ఎస్సై సుధాకర్‌పై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి రావాలనే..!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
అయితే, గత రెండు రోజుల నుంచి కూడా జమ్ము కశ్మీర్ అసెంబ్లీని స్పీకర్ అబ్దుల్ రహీమ్ క్రమంగా వాయిదా వేస్తున్నారు. ఈరోజు కూడా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, దీనిపై భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ కూడా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎన్‌సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరి కొందరు ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. ఇక, అసెంబ్లీ సమావేశాలకు ప్రతిష్టంభన ఏర్పడింది.. దాంతో హౌజ్‌ను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
#WATCH | J&K: MLAs clash inside the premises of the legislative assembly.
The house has been adjourned till 1 pm, following an uproar by NC MLAs demanding a discussion on the Waqf Act. pic.twitter.com/s3R8VnJ2w1
— ANI (@ANI) April 9, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!