Spider Bite: తూర్పు అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టిన్సుకియా జిల్లా పనిటోలా గ్రామంలో ఏడేళ్ల బాలిక సాలీడు (Spider) కాటుతో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పిల్లలు ఆడుకుంటుండగా.. ఆ చిన్నారి గుడ్లు ఉన్న ఓ వెదురు బుట్టలో ఉన్న గుడ్ల కోసం తెరిచింది. ఆలా తెరవగానే ఆ బుట్టలో ఉన్న నల్లటి సాలీడు చిన్నారి చేతిపై కొరికింది. దీంతో చిన్నారి చేయి వెంటనే వాచిపోయింది. దానితో తీవ్రమైన నొప్పితో బాధపడింది.
దానితో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఫార్మసీకి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం టిన్సుకియా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరేలోపే బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ సంఘటనపై అసహజ మరణం కేసు నమోదు చేశారు. ఈ కాటు ఎలాంటి సాలీడు జాతికి చెందిందో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే సంఘటన జరిగిన ప్రదేశం నుంచి కూడా నమూనాలు సేకరించారు.
CPI Narayana: రజనీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు?.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!
ఈ సంఘటన అస్సాంలో పెరుగుతున్న పర్యావరణ మార్పులు, ముఖ్యంగా విషపూరిత కీటకాలు, పాముల సహజ నివాసాల నాశనం పై దృష్టిని సారిస్తుంది. అటవీ నిర్మూలన, అక్రమ మైనింగ్, వన్యప్రాణుల ఆశ్రయ స్థలాల కలకలం వల్ల ఇవి నివాస ప్రాంతాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.