Assam: అస్సాంపై సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించారు.
Assam: అస్సాం భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) గురువారం రాత్రి ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేసింది. వారి వద్ద నుండి 7.25 కోట్ల రూపాయల విలువైన 29,000 యాబా టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.
అత్యంత దారుణమైన ఘటన అస్సాంలో వెలుగు చూసింది.. దీపావళి సందర్బంగా అల్లరిమూక చేసిన పనికి జంతు ప్రేమికులు తీవ్రంగా ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.. నలుగురు అబ్బాయిలు కోడి పురీషనాళంలోకి టపాసులు చొప్పించి పేల్చడం భాధాకరం.. అలా చేస్తూ వీడియోను తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని నాగావ్ జిల్లాలో రాహా గావ్‌లో నలుగురు బాలురు కోడి ప్రైవేట్ భాగంలో చొప్పించిన బాణసంచాతో…
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ వివాదాస్పద వ్యాఖ్యల్లోనే కాదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ పోస్టులే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రెండింగ్‌కి తగ్గట్లు పోస్టులు చేస్తుంటారు. ప్రస్తుతం హిమంత చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యం పొందిన డైలాగ్స్‌తో యువత రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ రీల్స్ ట్రెండ్ హిమంతను కూడా ఆకట్టుకున్నట్లు…
Himanta Biswa Sarma: ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను ‘‘మియా ముస్లింల’’ ఓట్లను ఆశించడం లేదని శనివారం అన్నారు. గౌహతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మియా ముస్లింలు ఎక్కువగా ఉన్నందున తాను మెడికల్ కాలేజీలను సందర్శించడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్భంద పదవీ విరమణతో పాటు పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఉద్యోగుల్ని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం ఉద్యోగులే ఇలా చేస్తే ఇది సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Earthquake: ఈశాన్య రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. మేఘాలయ రాష్ట్రంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. సాయంత్రం 6.15 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రెసుబెల్‌పరా జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ గారో హిల్స్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
మహిళపట్ల జరిగే అఘాయిత్యాలు అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాయి. కానీ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొంత మంది మగాళ్లు మృగాళ్లుగా మారి విరుచుకుపడుతున్నారు. ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని కిడ్నాప్ చేసి మరీ వాళ్ల కామవాంఛ తీర్చుకుంటున్నారు. మనుషులలాగా కాకుండా మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అస్సాం కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో హిమంతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాం ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన దేబబ్రత సైకియా ఫిర్యాదు చేశారు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై మరోసారి అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ విరుచుకుపడ్డారు. తాజాగా కాంగ్రెస్ చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. ఆ ట్వీట్ లో భారతదేశం మ్యాపులో ఈశాన్య రాష్ట్రాలు లేకపోవడంపై హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.