దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం (Satellite) ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది.
Assam: ఈశాన్య రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీన్ని నిరంతరం ఛేదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా డ్రగ్స్ కు సంబంధించిన కేసులో అస్సాం పోలీసులు ఘన విజయం సాధించారు. అస్సాం ఎస్టీఎఫ్, కమ్రూప్ జిల్లా పోలీసులు రూ.11 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Assam-Arunachal border: అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు.
Assam Boat Capsize: అసోంలోని ధుబ్రి జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ బ్రహ్మపుత్ర నదిలో పలువురు ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు, పలువురు గల్లంతయ్యారు. పడవలో దాదాపు 100 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, 10 మోటార్ సైకిళ్లను అందులో ఎక్కించారని స్థానికులు పేర్కొన్నారు. దీని బరువుకు అది మునిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధుబ్రి పట్టణానికి 3 కి.మీ…