Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ కొద్దిరోజులుగా జోరుగా వదంతులు నడిచాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆధ్వర్యంలో హత్య జరిగిందంటూ పుకార్లు నడిచాయి. ఉద్రిక్తతలు
Imran Khan: గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాలా జైలులో గత మూడేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ గత నాలుగు వారాలుగా కనిపించలేదు. ఆయనను కలిసేందుకు ఆయన చెల్లెళ్లను, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రికి కూడా అనుమతించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. పీ
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల రాజ్యాంగ సవరణ చేసింది. నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. పాకిస్తాన్ ఎలాంటి చర్చ లేకుండా త్వరితగతిన ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశ సర్వసైన్యాధ్యక్షుడిగా మారడంతో పాటు సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించారు. ఈ సవరణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తూ, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని…
Imran Khan vs Asim Munir: అసలు పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రావల్పిండి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పాక్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు అధికారులు, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లు మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రకటన ఇవ్వడం కూడా పరిస్థితిని చక్కబడేలా చేయలేదు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని, ఆయనను పాకిస్తాన్ ఆర్మీ హత్య చేసిందనే వార్తలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు.
Pakistan: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం దాదాపుగా కనుమరుగైనట్లే. పాకిస్తాన్‌లో ఇన్నాళ్లు ప్రజాస్వామ్యం ఉన్నట్లు బయటకు కనిపించినప్పటికీ, సైన్యం తెర వెనుక నుంచి ఆడించేది.
Pakistan: పాకిస్తాన్‌లో బయటకే ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా ఆ దేశ సైన్యం చేతిలోనే ఉంటుంది. సైన్యం ఏం చెప్పినా, ప్రభుత్వం తలాడించాల్సిందే. లేదంటే సైనిక తిరుగుబాట్లు తప్పవు. పాకిస్తాన్ ఎన్నో సార్లు సైనిక తిరుగుబాట్లను చూసింది. ఇప్పుడు, నాలుగో సారి ఆ దేశంలో ‘‘ఆసిమ్ మునీర్’’ రూపంలో తిరుగుబాటు జరుగున్నట్లు కనిపిస్తోంది.
Pakistan: పాకిస్థాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను పాక్ తోసిపుచ్చింది. పాకిస్థాన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కాదని ఓ పాకిస్థాన్ సినియర్ అధికారి అన్నారు. "పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించిన మొదటి దేశం కాదు.. అలాగే అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కూడా కాబోదు." అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి వాదనను అబద్ధాలకోరుగా తోసిపుచ్చారు. కాగా.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్,…
Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సవరణ లక్ష్యం ఏమిటంటే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ పదవీకాలం, చట్టపరమైన హోదా చుట్టూ ఉన్న అస్పష్టతను తొలగించడం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించిన విషయం తెలిసిందే. అయితే మునీర్ ఈ పదవి నుంచి అధికారికంగా నవంబర్ 28, 2025న…