Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది.…
India: సౌదీ అరేబియా-పాకిస్తాన్ కీలకమైన ‘‘వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని’’ కుదర్చుకున్నాయి. దీని ప్రకారం, ఒక దేశంపై దాడి రెండు దేశాలపై దాడిగా గుర్తిస్తామని ఒప్పందం నొక్కి చెబుతోంది. దీని ద్వారా, భారత ప్రయోజనాలకు దెబ్బపడే అవకాశం ఉంది. దీనిపై భారత్ స్పందించింది. భారత్- సౌదీ అరేబియా పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుంటుందని ఆశిస్తున్నట్లు భారతదేశం తెలిపింది.
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై విషం కక్కుతూనే ఉంది. ఇప్పటికే, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భారతదేశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు వేరు అంటూ, కాశ్మీర్ తన జీవనాడి అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని రోజులకు, పమల్గామ్లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు, ఆసిమ్ మునీర్ దారిలోనే పాక్ ఆర్మీ అధికారులు నడుస్తున్నారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ ఆర్మీపై భీకర దాడులు చేసింది. ముందుగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల కార్యాలయాలు, స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది.
Parliament attack: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సీనియర్ ఉగ్రవాది మసూద్ ఇలియాస్ కాశ్మీరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్లో ఓ మతపరమైన కార్యక్రమంలో తన బాస్, జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ చేసిన ఉగ్రవాద దాడుల గురించి చెబుతూ, అతడిపై ప్రశంసలు కురిపించారు.
పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ప్రతిరోజూ భారత్ పై విషం కక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా, షాబాజ్ షరీఫ్ మునీర్‌ను పదోన్నతి కల్పించి ఫీల్డ్ మార్షల్‌గా చేశాడు. కానీ దేవుడు తనను రక్షకుడిగా చేశాడని, తనకు ఏ పదవి అవసరం లేదని అసిమ్ మునీర్ చెబుతున్నాడు. Also Read:BCCI New Rule: బీసీసీఐ సరికొత్త రూల్.. ఆ…
అసిమ్ మునీర్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. భారత్‌పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
ఈ ఆపరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. మన పౌరులను బలి తీసుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరగానే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి అగ్ర రాజ్యం అమెరికాకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కాలంలో రెండో పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.