భారత్ మంచి స్నేహితుడు అంటూనే ట్రంప్ భారీ బాదుడు బాదారు. ఊహించని రీతిలో సుంకం విధించారు. ఆసియా దేశాలన్నీ ఒకెత్తు అయితే.. భారత్‌పై మరొకలా టారిఫ్ విధించారు.
భారతదేశం పొరుగున ఉన్న మాల్దీవుల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్థిక సంస్కరణల ప్రయత్నాల్లో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చు తగ్గింపును ప్రకటించారు. మహ్మద్ ముయిజ్జూ తన జీతంలో 50 శాతం తీసుకోబోరని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, మాల్దీవులలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించబడుతుంది.
అమెరికా, చైనాల మధ్య శత్రుత్వం ప్రపంచానికి దాపురించింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ట్రేడ్ వార్ నడుస్తోంది. దీని ప్రయోజనాన్ని పొందడానికి, భారతదేశం తన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసింది.