భారత్ మంచి స్నేహితుడు అంటూనే ట్రంప్ భారీ బాదుడు బాదారు. ఊహించని రీతిలో సుంకం విధించారు. ఆసియా దేశాలన్నీ ఒకెత్తు అయితే.. భారత్‌పై మరొకలా టారిఫ్ విధించారు. ఈ పరిస్థితి చూస్తుంటే.. భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. రెండు దాయాది దేశాల మధ్య వత్యాసం బాగా చూపించారు. పాకిస్థాన్‌కు ఒక రీతిగా.. ఇండియాకు మరొక రకంగా టారిఫ్ విధించడం విశేషం.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన పసిడి ధర
తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని బాంబ్ పేల్చారు. దీంతో మొత్తం భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. ఈ పరిణామాన్ని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తప్పుపట్టారు. ఇది చాలా పక్షపాతం అని.. ఇది అపారమైన నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
ఆసియా దేశాలపై టారిఫ్‌లు ఇలా..
భారత్- 50 శాతం
సిరియా-41 శాతం
మయన్మార్-40 శాతం
లావోస్- 40 శాతం
ఇరాక్ -35 శాతం
చైనా -30 శాతం
కజికిస్థాన్-25 శాతం
వియత్నాం- 20 శాతం
శ్రీలంక-20 శాతం
పాకిస్థాన్-19 శాతం టారిఫ్ విధించారు.
అత్యధికంగా భారతదేశంపైనే టారిఫ్ విధించారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. సుంకాలపై తేలిన తర్వాతనే భారత్‌తో చర్చలుంటాయని.. అప్పటి వరకు ఎలాంటి చర్చలు ఉండవని తెలిపారు. దీన్ని బట్టి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.