IND Vs SL: ఆసియా కప్‌లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. పాకిస్థాన్‌తో ఆడిన రవి బిష్ణోయ్ స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అశ్విన్‌కు స్థానం కల్పించింది. అయితే ఆశ్చర్యకరంగా దీపక్ హుడానే కొనసాగిస్తూ అక్షర్ పటేల్‌కు మరోసారి మొండిచేయి చూపించింది. గత…
Asia Cup 2022: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ పాకిస్థాన్ గెలుస్తుందంటూ సెహ్వాగ్ జోస్యం చెప్పడంతో పలువురు నెటిజన్‌లు మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మంగళవారం నాడు శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే దాయాది పాకిస్థాన్ ఆసియా కప్ ఎగరేసుకుపోతుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే దాయాది పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు…
Team India: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధానంగా చేసిన మూడు తప్పులే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్‌లు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో జట్టులోకి తీసుకున్న దీపక్ హుడా చేత బౌలింగ్ వేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇస్తున్నా అతడిని గుడ్డిగా నమ్మి ఫుల్ ఓవర్లు వేయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ మహ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో…
Virat Kohli: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం నాడు సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై ఓడిపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో అర్ష్‌దీప్ సింగ్ అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అర్ష్‌దీప్ క్యాచ్ విడిచిపెట్టడంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీని అడగ్గా.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంతో టెన్షన్ ఉంటుందని..…
Asia Cup 2022: ఆసియా కప్‌లో సూపర్-4 రసవత్తరంగా మారింది. పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఇప్పుడు పాయింట్ల టేబుల్ ఆసక్తి రేపుతోంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించడంతో ప్రస్తుతం ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో పాకిస్థాన్ ఉంది. శ్రీలంక నెట్ రన్‌రేట్ 0.589గా నమోదు కాగా పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ 0.126గా ఉంది. టీమిండియా నెట్ రన్‌రేట్ మాత్రం -0.126గా, ఆప్ఘనిస్తాన్ నెట్ రన్‌రేట్ -0.589గా ఉంది. పాయింట్ల పట్టికలో…
IND Vs PAK: దుబాయ్ వేదికగా టీమిండియాతో సూపర్-4లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 181/7 పరుగులు చేసింది. 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో పాకిస్థాన్ జట్టును ఆదుకున్నాడు. అతడు 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71…
IND Vs PAK: దుబాయ్ వేదికగా సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28), రోహిత్ (28) జోరుతో టీమిండియా 200 పరుగులకు పైగా స్కోరు చేస్తుందని అభిమానులు ఆశించారు. ఓపెనింగ్‌లో శుభారంభం దక్కినా ఆ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయిన భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 60…
IND Vs PAK LIVE UPDATES: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈరోజు మరోసారి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.