స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం ఎదురుచూసిన అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎట్టకేలకు మూడేళ్ల అనంతరం.. దాదాపు వెయ్యి రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ కొట్టాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం జరుగుతోన్న ఆసియా కప్ సూపర్ 4 చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఆసియా కప్ 2022లో టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో అవేశ్ ఖాన్ స్థానంలో దీపక్ చాహర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.అవేష్ ఖాన్ అనారోగ్యం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.
Sunil Gavaskar: ఆసియా కప్‌లో టీమిండియా వైఫల్యానికి టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులోని ఆటగాళ్లను తరుచూ మాట్లాడటం వల్లనే టీమిండియాకు ఈ గతి పట్టిందన్నాడు. 11మంది ఆటగాళ్లు తరచూ కలిసి ఆడకపోవడంతోనే ఆసియా కప్‌లో స్పీడ్ అందుకోలేకపోయారని.. అందుకే టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులోని ఆటగాళ్లను దక్షిణాఫ్రికా, ఆసీస్‌తో సిరీస్‌లకు ఆడించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆటగాళ్ల ఎంపికలో…
ArshDeep Singh: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప తేడాతో ఓడిపోయింది. కీలక సమయంలో టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కొందరు అతడిని ఖలిస్థాన్ దేశస్థుడిగా చిత్రీకరించారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అర్ష్‌దీప్ సింగ్ పట్టించుకోకుండా శ్రీలంకతో మ్యాచ్ ఆడాడు. తనపై వచ్చిన కామెంట్స్‌ను చూసి నవ్వుకున్నానని అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా చెప్పాడు. అయితే…
ICC Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ నంబర్‌వన్ ఆటగాడిగా అవతరించాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్థానాన్ని రిజ్వాన్ ఆక్రమించాడు. దీంతో బాబర్ ఆజమ్ రెండో స్థానానికి పడిపోయాడు. రిజ్వాన్ ఖాతాలో 815 రేటింగ్ పాయింట్లు ఉండగా బాబర్ ఆజమ్ ఖాతాలో 794 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో మహ్మద్ రిజ్వాన్ అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే…
Team India: ఆసియా కప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియాపై పలువురు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అసలు టీమిండియా ఆసియాకప్‌కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ పరమ చెత్తగా ఉందని.. అతడి నిర్ణయాలు అంతుబట్టలేని విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆసియా కప్‌ను ప్రయోగాల కోసం వాడుకుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌పైనా దుమ్మెత్తి పోస్తున్నారు. టీ20 ప్రపంచకప్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా టీమ్ సెట్ కాకపోవడం ఏంటని…
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లలో సున్నా పరుగులకే అవుటైన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడిన కోహ్లీ మధుశంక బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో కోహ్లీ హాఫ్ సెంచరీలు చేసి ఊపు…
IND Vs SL: ఆసియా కప్‌లో శ్రీలంకపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ(72), సూర్యకుమార్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల లక్ష్యం నిలిచింది. శ్రీలంక బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో భారత బ్యాటర్లను ఔట్ చేశారు. లంక బౌలర్లలో మధుశంక 3,…