Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. ఆదివారం నాడు దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు భారత్, పాకిస్థాన్ జట్లు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దీంతో రెండు జట్లు జరిమానా బారిన పడ్డాయి. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల…
IND Vs HKG: దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు చేసింది. పాకిస్థాన్‌తో టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో కీపర్ రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంది. రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాండ్యా తమకు చాలా కీలక ఆటగాడు అని.. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా స్థానంలో పంత్ ఆడతాడని చెప్పాడు.…
Asia Cup: ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై అదరగొట్టిన టీమిండియా రెండో మ్యాచ్‌లో బుధవారం నాడు హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్ టీమిండియానే అయినా హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే అవుతుంది. గ్రూప్-బిలో ఆప్ఘనిస్తాన్ అదరగొట్టే రీతిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. అదే విధంగా గ్రూప్-ఎలో హాంకాంగ్ సంచలనాలు నమోదు చేయాలని ఆరాటపడుతోంది. గతంలో ఆసియా కప్‌లో 2008లో, 2018లో హాంకాంగ్‌తో ఇండియా తలపడింది.…
Team India: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా విజయం తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో 30 కంటే ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ కెప్టెన్సీ నమోదు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ 36 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. అందులో 30 మ్యాచ్‌లను భారత్ గెలుచుకుంది. కేవలం ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ విన్నింగ్…
Asia Cup 2022: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన, భువనేశ్వర్ బౌలింగ్, విరాట్ కోహ్లీ విలువైన పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆసియాకప్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్ తలపడే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పోటీ…
ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి దాయాదుల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గత టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారంగా టీమిండియా ఘన విజయాన్ని సాధించింది.
IND Vs PAK: ఆసియా కప్‌లో దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కాగా రోహిత్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కోహ్లీ మాత్రం తనకు లభించిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకుని 35 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. 15 ఓవర్‌లో హార్దిక్ పాండ్యా…
Asia Cup 2022: దుబాయ్ వేదికగా ఆసియా కప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ 10 పరుగులకు అవుటయ్యాడు. ఓపెనర్ రిజ్వాన్ (43) నిలబడ్డా అతడికి సహకారం అందించేవారు కరువయ్యారు. వరుస విరామాల్లో పాకిస్థాన్ వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు…