రాబోయే రెండు సంవత్సరాల్లో 50 అమృత్ భారత్ రైళ్లను అధునాతన ఫీచర్లతో తయారు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ రైళ్లలో మెరుగుపరిచిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను అశ్విని వైష్ణవ్ పంచుకున్నారు.
ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
Pamban bridge: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తమిళనాడు రామేశ్వరంలో నిర్మితమైన కొత్త వంతెన ఫోటోలను పంచుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి ‘‘వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్’’గా కొత్తగా పంబన్ వంతెన కీర్తి గడించింది. ఈ వంతెన ద్వారా 105 ఏళ్ల పాత వంతెనని భర్తీ చేయనున్నారు. ఎక్స్ వేదికగా ఈ ఇంజనీరింగ్ అద్భుతం గురించి కేంద్రమంత్రి వెల్లడించారు. కొత్త పంబన్ వంతెనని ‘‘ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం’’గా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వేగం, భద్రత కోసం డిజైన్…
Pan Card 2.0 Use: సోమవారం జరిగిన సమావేశంలో పాన్ కార్డు 2.0ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఆదాయపు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అన్ని ప్రభుత్వ ఏజెన్సీల డిజిటల్ సిస్టమ్‌ల కోసం ‘శాశ్వత ఖాతా సంఖ్య’ ను ‘కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్’ గా…
ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు.
iPhone 16: టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను నిన్న రిలీజ్ చేసింది. నాలుగు మోడళ్లను ఐఫోన్ 16లో తీసుకువచ్చారు. ‘‘ఇట్స్ గ్లోటైమ్’’ ఈవెంట్‌లో ఐఫోన్ 16తో పాటు ఆపిల్ వాచ్, ఎయిర్‌పోడ్స్‌ని విడుదల చేసింది. ఇదిలా ఉంటే చైనా వెలుపల అసెంబుల్ చేయబడిన తొలి ఐఫోన్ ఇదే కావడం విశేషం. పూర్తిగా ‘మేడ్ ఇన్ ఇండియా’గా ఐఫోన్ 16 తయారైంది. భారతదేశ ఫ్యాక్టరీలో తయారు చేయబడిన ఐఫోన్ 16 ప్రపంచ దేశాలకు…
Cabinet Decisions: దేశవ్యాప్తంగా కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత మాట్లాడిన ఆయన.. ‘‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు క్యాబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 28,602 కోట్లు పెట్టుబడి…
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.