Vande Bharat Sleeper: అదిరిపోయే “వందే భారత్ స్లీపర్ ట్రైన్” ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..
- మరో మూడు నెలల్లో వందేభారత్ స్లీపర్ ట్రైన్లు..
- ప్రయాణికుల భద్రతకు పెద్దపీట..
- 16 కోచులు..ఆటోమేటిక్ డోర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Sleeper: భారతీయ రైల్వే మరింత అధునాతనంగా తయారవుతోంది. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం వందేభారత్ రైళ్లను తీసుకువచ్చింది. ప్రయాణికులు మరింత తొందరగా గమ్యస్థానం చేరేందుకు ఈ రైళ్లను దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ప్రారంభించారు. ఇదిలా ఉంటే తాజాగా వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ప్రపంచ స్థాయి ఫీచర్లను ఈ కొత్త రైళ్లలో అందిస్తున్నారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూర్‌లోని బీఈఎంఎల్‌లో కొత్త వందేభారత్ స్లీపర్ కోచ్‌లను పరిశీలించారు. ప్రస్తుతం వందేభారత్ స్లీపర్ మూడు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. వందేభారత్, చైర్ కార్ వందేభారత్ మెట్రో, వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ అనే నాలుగు కాన్ఫిగరేషన్లలో త్వరలో దేశంలో మెరుగైన రైలు సేవల్ని అందిస్తాయని ఆయన అన్నారు. ప్రజల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌తో వందేభారత్ ప్రతీ వెర్షన్‌ని మెరుగుపరుస్తున్నామని చెప్పారు.
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
Read Also: West Bengal: కోల్‌కతా ఘటన మరవకముందే.. బెంగాల్ హాస్పిటల్‌లో నర్స్‌పై వేధింపులు..
ట్రైన్ ఫీచర్లు:
వందే భారత్ స్లీపర్ రైలు సెట్ స్టెయిన్‌లెస్-స్టీల్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్రయాణికలు భద్రతను పెంచడానికి మరిన్ని ఫీచర్లను జోడించారు. ప్రత్యేకంగా రూపొందించిన క్రాష్ బఫర్‌లు, కప్లర్‌ల వంటి అధునాతన క్రాష్‌వర్తీ ఎలిమెంట్లు అమర్చబడ్డాయి. ట్రెయిన్ కఠినమై అగ్నిప్రమాదాలను కూడా తట్టుకునేలా రూపొందిచారు.
స్లీపర్ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. ఇందులో 11 ఏసీ త్రి టైర్ కోచుల్లో 611 బెర్తులు, 4 ఏసీ టూ టైర్ కోచుల్లో 188 బెర్తులు, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉన్నాయి. వందేభారత్ స్లీపర్ కోచ్ మరింతగా అప్‌గ్రేడ్ అవుతోంది. ఇంటీరియర్స్ ప్యానెల్స్, సీట్లు, బెర్తులు అన్ని కొత్తగా ఉన్నాయి. BEML ఎలక్ట్రికల్, ప్రొపల్షన్, బోగీలు, ఎక్స్‌టీరియర్ ప్లగ్ డోర్లు, బ్రేక్ సిస్టమ్‌లు మరియు HVAC వంటి కీలకమైన సిస్టమ్‌ల ఉన్నాయి. గంటలకు 160 కి.మీ వేగంతో పరుగు తీసేలా రూపొందించారు.
వందే భారత్ యొక్క స్లీపర్ వెర్షన్‌లో యుఎస్‌బి ఛార్జింగ్ సదుపాయంతో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ మరియు విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్‌సైడ్ డిస్‌ప్లే ప్యానెల్‌లు మరియు సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీలు మరియు విభిన్నంగా ఉండే ప్రత్యేక బెర్త్‌లు మరియు టాయిలెట్‌లతో సహా ప్రపంచ స్థాయి ఫీచర్లు ఉంటాయి. వికలాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఫస్ట్ ఏసీలో హాట్ వాటర్ షవర్స్ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ ఎక్సీటీరయర్ డోర్స్, సెన్సార్ ఆధారంగా పనిచేసతే ఇంటర్ కమ్యూనికేషన్ డోర్స్, రిమోట్‌తో పనిచేసే ఫైర్ బారియర్ డోర్లు, ఎర్గోనామిక్‌గా డిజైన్ చేయబడిన వాసన రాని టాయిలెట్ సిస్టమ్, డ్రైవింగ్ సిబ్బంది కోసం టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
The Sleeper version of Vande Bharat train looks amazing. pic.twitter.com/vpIDgiPZ2j
— Indian Tech & Infra (@IndianTechGuide) September 1, 2024
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!