వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి భారతదేశం ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ లు ప్రారంభానికి ఇంకెంతో సమయం లేదు. అయితే ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచకప్ కు ముందు ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుండి పూర్తిగా కోలుకోలేక మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు ఆల్ రౌండర్ అష్టన్ అగర్.