Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి, రాజకీయ దుమారానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు 8 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్‌ను తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే తప్పా నిందితుడిని…
లఖింపూర్ ఖేరీ హింస కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి బెయిల్ పిటిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో వ్యతిరేకించింది.
యూపీలోని లఖింపూర్ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మంగళవారం నిరాకరించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కోర్టులో లొంగిపోయాడు. లఖింపూర్‌లో వ్యవసాయ చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న రైతులపైకి కారుతో వేగంగా దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఆ తర్వాత జరిగిన అల్లర్లలో మరో నలుగురు సహా మొత్తం 8 మంది మృతికి కారకుడయ్యాడంటూ ఆశిష్ మిశ్రాపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీంతో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆశిష్ మిశ్రాపై…
లఖింపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్‌ను రద్దు చేసింది సుప్రీంకోర్టు… అలహాబాద్ హైకోర్టు ఆశిష్‌మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే సమయంలో.. వారం రోజుల్లోగా లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాను ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం… అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.. కాగా, ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు మిశ్రాకు బెయిల్ మంజూరు…
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది… అయితే, తొలిసారి ఈ ఘటనపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ… లఖింపూర్ ఖేరీ ఘటన జరిగిన 4 నెలల తర్వాత మొదటి సారి రైతుల హత్యలపై వ్యాఖ్యానించారు.. ఈ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అక్టోబర్ నుండి జైలులో ఉండగా.. అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతడిని హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగిస్తోంది నరేంద్ర మోడీ…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు భువనేశ్వర్‌లో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన స్టూడెంట్స్ విభాగం నేతలు కోడి గుడ్లతో దాడి చేశారు. ఆయన భువనేశ్వర్ నుంచి కటక్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంత్రి కాన్వాయ్‌ను ముందుకు వెళ్లకుండా విద్యార్థి నాయకులు నల్ల బ్యాడ్జీలను ప్రదర్శించి అడ్డుకున్నారు. లఖింపుర్‌ఖేరి హింసాత్మక ఘటనలో అజయ్ మిశ్రా కొడుకు, ఆశిష్ మిశ్రా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆశిష్ మిశ్రాపై రైతుల పైకి…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన.. లఖింపూర్ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు… ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంకా తెలియలేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై స్పష్టత కొరవడింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులకూ ఆశిష్ స్పందించలేదు. ఇవాళ ఉదయం పదింటికి.. క్రైం బ్రాంచ్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. అతను రాకపోవడంతో ఎక్కడున్నాడనే ఉత్కంఠ నెలకొంది. ఆశిష్ మిత్రా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే విషయం.. ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు…