శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘తెలుగులో ఎక్కువగా సహాయ పాత్రలు వస్తున్నాయి. అయితే సోలో హీరోగా నటించాలనుకొని మంచి అవకాశం కోసం ఎదుచుస్తున్న తరుణంలో మేకప్‌మెన్ ద్వారా ఈ దర్శకనిర్మాతలు కలిశారు.…
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది.…