‘అసలేం జరిగింది’ విజయంతో ఆనందం: హీరో శ్రీరామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘తెలుగులో ఎక్కువగా సహాయ పాత్రలు వస్తున్నాయి. అయితే సోలో హీరోగా నటించాలనుకొని మంచి అవకాశం కోసం ఎదుచుస్తున్న తరుణంలో మేకప్‌మెన్ ద్వారా ఈ దర్శకనిర్మాతలు కలిశారు. వారు చెప్పిన కథ నచ్చింది. లిమిటెడ్ బడ్జెట్‌లో నిజాయితీగా సినిమా చేస్తామని, క్రమశిక్షణ, తపనతో సినిమా పూర్తిచేశారు. కష్టపడి సాధించిన విజయంలో సంతృప్తి ఉంటుంది.
Read also : ‘ఐకాన్’ మళ్ళీ ఆగనుందా!?
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
అలాంటి సక్సెస్‌ను అందించిన చిత్రమిది. కొత్తవారిని ప్రోత్సహించే కింగ్ జాన్సన్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలి. మిడిల్‌క్లాస్ సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది’ అని అన్నారు. నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ ‘ఎక్సోడస్ మీడియా పతాకంపై మేము నిర్మించిన తొలి సినిమా ఇది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో పరిమిత బడ్జెట్‌లో తీశాం. చక్కటి స్పందన లభిస్తోంది. ఊహించని విజయమిది’ అని తెలిపారు. దర్శకుడు ఎన్వీఆర్ మాట్లాడుతూ ‘ఈ సక్సెస్ క్రెడిట్ నిర్మాత జాన్సన్‌కు దక్కుతుంది. సినిమా హిట్ అవుతుందని నమ్మిన తొలి వ్యక్తి హీరో శ్రీరామ్. నన్ను, నా కథను నమ్మి అండగా నిలిచారు’ అని చెప్పారు. ఇందులో విలన్‌గా నటించానని, శ్రీరామ్ చక్కటి సలహాలిచ్చారని నటుడు రవికుమార్ పేర్కొన్నారు.




తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..