ఉత్తరప్రదేశ్లో ఎన్నికల టైం సమీపిస్తున్న కొద్ది అక్కడ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా అసెంబ్లీ, ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికంగా ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో ఈజీగా వరుసగా బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగీ సర్కారును దెబ్బకొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.…
అఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు చాలా దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే.. అఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. ఇటు MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ..కూడా స్పందించి… తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని రెండు రోజుల క్రితం ట్వీట్ చేశాడు. అయితే.. దీనిపై బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో…
మాజీ మంత్రి ఈటల రాజేదర్.. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరిన వేళ ఆ పార్టీపై సెటైర్లు వేశారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ… నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలను ప్రస్తావించారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సెక్యూరిటీ డిపాజిట్ను దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైందని ఎద్దేవా చేసిన ఆయన.. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయిందని విమర్శించారు.. మరోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ…
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ విజ్ఞప్తి చేశారు. అందులో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోందని… లాక్ డౌన్ పై తన వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు…దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయని తెలిపారు.…