ముంబైలోని నటుడు షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్ దీపావళికి ముందు దీపాలతో అలంకరించారు. దీనికి కారణం లేకపోలేదు. అతని కుటుంబం వేడుక చేసుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ విడుదలయ్యారు. ఆర్యన్‌తో పాటు మరో ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అక్టోబర్ 2న ముంబైలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుండి అరెస్టు చేసింది. డ్రగ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో…
డ్రగ్స్ కేసులో దాదాపు 26 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ ఈరోజు బెయిల్ పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు. ఆర్యన్ తో పాటు ఆయన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మోడల్ మున్మున్ ధమేచా కూడా ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో వీరందరినీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 3న అరెస్టు చేసింది. ముగ్గురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు…
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యాడు. షారుఖ్ ఖాన్, గౌరీ కుమారుడు త్వరలో మన్నత్ చేరుకోనున్నారు. కాసేపటి క్రితమే ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ పూర్తయింది. షారుఖ్ తన కుమారుడిని జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి జైలుకు చేరుకున్నాడు. ఆర్యన్ బయటకు రాగానే అతన్ని బాడీగార్డ్ వెంటనే కారులోకి పంపాడు. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్,…
డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో మూడు వారాల పాటు జైలు జీవితం గడిపిన సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈరోజు జైలు నుంచి బయటకు రానున్నారు. నిన్న ఆయన బెయిల్ పత్రాలు స్వీకరణకు గడువు ముగియడంతో మరో రాత్రి ఆర్యన్ జైలులో గడపవలసి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అక్టోబరు 2న క్రూయిజ్ షిప్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసిన తర్వాత అరెస్టయి, దాదాపు ఒక నెల జైలు జీవితం గడిపాడు.…
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చిన తర్వాత షారూఖ్ ఖాన్ తన న్యాయవాద బృందాన్ని కలిశారు. షారూఖ్, అతని లీగల్ టీమ్ కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఆర్యన్ కు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన షారుఖ్…
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ రావడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరఫున బాంబే హైకోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. దేశంలో ఆయన చాలా ఫేమస్ లాయర్. అటార్నీ జనరల్‌గానూ పనిచేశారు. ఈ నేపథ్యంలో ముకుల్ రోహత్గీ వంటి లాయర్ వాదించబట్టే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వచ్చిందని దర్శకుడు వర్మ అభిప్రాయపడ్డాడు. Read Also:…
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట కలిగింది. అతడికి బెయిల్ మంజూరు చేస్తూ గురువారం నాడు బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. 21 రోజులుగా ఆర్యన్ ఖాన్ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఓ స్టార్ హీరో తనయుడు ఇన్నిరోజుల పాటు జైలులో ఉండటం అటు బాలీవుడ్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కాగానే…
దీపావళికి పది రోజుల ముందు చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీ కొత్త ప్రకటనతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించారు. ఈ దీపావళికి స్థానిక దుకాణాల నుండి వస్తువులను కొనుగోలు చేయాలని ఈ ప్రకటనలో క్యాడ్‌బరీ తన వీక్షకులకు విజ్ఞప్తి చేసింది. ‘కోవిడ్ సమయంలో నష్టపోయిన పెద్ద వ్యాపారాలు, బ్రాండ్‌లు మళ్ళీ పుంజుకున్నాయి. కానీ చిన్న దుకాణాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి’ అని ప్రారంభమయ్యే ఈ యాడ్ 2.18 నిమిషాలు ఉంది. అందులోనే…
ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో NCB దర్యాప్తు వేగవంతం చేసింది. మరోసారి విచారణకు రావాలని హీరోయిన్ అనన్య పాండేకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అనన్యను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వేధిస్తోందని మండి పడ్డారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. పోలీసులు హెరాయిన్ పట్టుకుంటే.. ఎన్సీబీ హీరోయిన్లను పట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ఎన్సీబీ సోమవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది.ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు చిన్నగా అనన్య పాండే మెడకు…
అక్టోబర్ 21వ తేది, గురువారం దాదాపు నాలుగు గంటల పాటు ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను ఆర్యన్ ఖాన్ తో ఉన్న అనుబంధం, డ్రగ్స్ వాడకంపై తమ కార్యాలయంలో విచారించారు. దానికి ముందు ఆమె సెల్ ఫోన్ ను, లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. అలానే ఆర్యన్ తో అనన్య గతంలో చాటింగ్ చేసిన విషయాలను ఎన్సీబీ అధికారులు ఈ సందర్భంగా ఆమె దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే… ఆర్యన్, అనన్య…