ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చిన తర్వాత షారూఖ్ ఖాన్ తన న్యాయవాద బృందాన్ని కలిశారు. షారూఖ్, అతని లీగల్ టీమ్ కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఆర్యన్ కు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన షారుఖ్ తన లీగల్ టీం కు పార్టీ ఇచ్చారట. ఇప్పుడు వైరల్ అవుతున్న పిక్ దానికి సంబంధించిందే అని తెలుస్తోంది.
అక్టోబరు 2న క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది. అరెస్టు అనంతరం పలు నాటకీయ పరిణామాల మధ్య ఆర్యన్ ఖాన్ మూడు వారాల పాటు కస్టడీలో ఉన్నాడు. ఇన్ని రోజులూ ఆయన ఆర్ధర్ రోడ్ జైలులో గడిపాడు. కాగా ఆర్యన్ ఖాన్ తరపున న్యాయవాది సతీష్ మనేషిండే బృందం కోర్టులో వాదించారు. ఆర్యన్ కు బెయిల్ వచ్చిన తరువాత న్యాయవాది సతీష్ మాట్లాడుతూ “ఆర్యన్ షారూఖ్ ఖాన్ చివరికి హెచ్‌సి బెయిల్‌పై విడుదలయ్యాడు. అక్టోబరు 2, 2021న అతన్ని అదుపులోకి తీసుకున్న మొదటి క్షణం నుండి ఇప్పటి వరకూ ఆర్యన్ దగ్గర ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. అలాగే డ్రగ్స్ కు సంబంధించిన ఆధారాలు, వినియోగం వంటివి ఏమీ దొరకలేదు. మా ప్రార్థనలను మిస్టర్ జస్టిస్ నితిన్ సాంబ్రే అంగీకరించి, ఆర్యన్‌కి బెయిల్ మంజూరు చేసినందుకు మేము దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సత్య మేవ జయతే” అని అన్నారు. విచారణ సందర్భంగా ఆర్యన్ ఖాన్‌పై వాట్సాప్ చాట్‌లు ‘బల్క్ క్వాంటిటీ’ డ్రగ్స్‌ను సూచించాయని ఎన్‌సిబి వాదించింది.
Read Also : “సర్కారు వారి పాట”లో ఎవరెవరు ఏఏ పాత్రలు చేస్తున్నారంటే ?
ఆర్యన్ ఖాన్ బెయిల్‌ను పురస్కరించుకుని షారుఖ్ ఖాన్ అభిమానులు ఆయన నివాసం మన్నత్ వెలుపల బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కేసులో అర్బాజ్ మర్చంట్, మున్ముమ్ ధమేచాకు కూడా బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అక్టోబరు 2న సముద్రం మధ్యలో గోవాకు వెళ్తున్న కోర్డెలియా క్రూయిజ్ షిప్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై ఎన్‌సిబి బృందం దాడి చేసింది. ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ లతో సహా మొత్తం 20 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. అందులో భాగంగానే ఆర్యన్ ఖాన్, మర్చంట్, ధమేచాలను ఎన్సీబీ అక్టోబర్ 2న అరెస్టు చేసింది. నిషేధిత డ్రగ్స్ కలిగి ఉండటం, వినియోగం, అమ్మకం/కొనుగోలు, కుట్ర, ప్రేరేపణకు సంబంధించి నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (NDPS) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.