ఆర్యన్ బెయిల్ కు ష్యూరిటీ ఇచ్చిన హీరోయిన్… ఎవరో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో మూడు వారాల పాటు జైలు జీవితం గడిపిన సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈరోజు జైలు నుంచి బయటకు రానున్నారు. నిన్న ఆయన బెయిల్ పత్రాలు స్వీకరణకు గడువు ముగియడంతో మరో రాత్రి ఆర్యన్ జైలులో గడపవలసి వచ్చింది.
ఆర్యన్ ఖాన్ అక్టోబరు 2న క్రూయిజ్ షిప్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడి చేసిన తర్వాత అరెస్టయి, దాదాపు ఒక నెల జైలు జీవితం గడిపాడు. డ్రగ్స్-ఆన్-క్రూజ్ కేసులో మొత్తం 20 మందిని అరెస్టు చేసిన కేసులో ఆర్యన్ “A1 నిందితుడు”. 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్-క్రూయిజ్ కేసులో అరెస్టయిన తర్వాత మరో ఇద్దరు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
Also Read
Read Also : కూతురు వచ్చాకే పునీత్ అంత్యక్రియలు
బాంబే హైకోర్టు తన ఆపరేటివ్ ఆర్డర్‌ను ఇచ్చాక ఎన్‌డిపిఎస్ కోర్టులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కోసం ఓ హీరోయిన్ ష్యూరిటీగా లక్ష రూపాయల బెయిల్ బాండ్‌పై సంతకం చేయడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నటి జుహీ చావ్లా శుక్రవారం ఆర్యన్ బెయిల్ పై ష్యూరిటీ సంతకం చేశారు. ఆర్యన్ ఖాన్ డబ్బు చెల్లించడంలో విఫలమైతే ఆమె చట్టపరంగా బాధ్యత వహిస్తుందని దీని అర్థం.
అనేక సినిమాల్లో షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా కలిసి నటించారు. బాలీవుడ్ లో ఈ జంట గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సహ యజమానులుగా మారారు. ఆర్యన్ ఖాన్, జుహీ చావ్లా కుమార్తె జాన్వీ ఇటీవల IPL ఆటగాళ్ల వేలంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
-
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!