ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల కారణంగా.. ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను తప్పిస్తూ ఎన్‌సీబీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో విచారణాధికారిగా సంజయ్ సింగ్‌ను నియమించారు. వాంఖడేను ఢిల్లీలో ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇకపై ఆర్యన్‌ఖాన్ కేసు సహా మొత్తం ఆరు డ్రగ్ కేసులను సంజయ్ సింగ్ నేతృత్వంలో ఎన్‌సీబీ సెంట్రల్…
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చిన తర్వాత షారూఖ్ ఖాన్ తన న్యాయవాద బృందాన్ని కలిశారు. షారూఖ్, అతని లీగల్ టీమ్ కెమెరాను చూసి నవ్వుతూ కనిపిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఆర్యన్ కు బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన షారుఖ్…
క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో ఆర్యన్ ఖాన్‌తో పాటు అతని సహచరుల బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కృతనిశ్చయంతో NCB ఉన్నట్టు స్పష్టమవుతోంది.ముంబై సెషన్స్ కోర్టులో నిన్న ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగినప్పుడు… అతను బయటకొస్తే సాక్ష్యాలు తారుమారైపోతాయనే ఆందోళన వ్యక్తం చేసింది NCB. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని… అది పూర్తయ్యే వరకూ ఆర్యన్‌ను విడుదల చేయవద్దని NCB కోరింది. రైడ్ జరిగినప్పుడు ఆర్యన్…
ముంబై క్రూయిజ్‌షిప్ కేసులో ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుపుతోంది న్యాయస్థానం. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది న్యాయస్థానం. దీంతో నాలుగోసారి బెయిల్ కోసం పిటిషన్ వేశారు ఆర్యన్ తరపు న్యాయవాది. అయితే, ఈ కేసులో ఎన్‌సీబీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది ఎన్‌సీబీ. ఈ కేసులో అరెస్టైన మిగతావారిలాగే ఆర్యన్‌ఖాన్‌కు కూడా సంబంధం ఉందని వాదనలు వినిపించింది. ఆర్యన్‌ఖాన్‌ను, మిగతావారిని వేరు చేసి చూడలేమని చెప్పింది ఎన్సీబీ.…
ముంబై క్రూయీజ్ డ్రగ్స్ పార్టీ కేసులో… బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. అతని బెయిల్ పిటిషన్‌ను కోర్టు మూడో సారి తిరస్కరించింది. శుక్రవారం వరకు ఆర్యన్‌ను తమ కస్టడీలోనే ఉంచాలన్న ఎన్సీబీ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది న్యాయస్థానం. స్టేట్మెంట్ సమర్పించాలని ఆదేశించింది.డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు.. మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో అతను మరో మూడ్రోజులు జైల్లోనే ఉండనున్నాడు. నార్కొటిక్స్ కంట్రోల్…
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో హాజరుపరిచింది ఎన్సీబీ.. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు పారేస్తూ.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆర్యన్ ఖాన్ తో పాటు 7 గురిని.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆర్యన్ ఖాన్‌ను ఇన్నిరోజులు పాటు విచారించిన అవసరంలేదంటూ ఆయన తరుపున న్యాయవాది చెప్పిన…
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నందుకు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సిబి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శనివారం రాత్రి గోవా వెళ్లే క్రూయిజ్ లైనర్‌లో జరిగిన పార్టీలో దాడి చేసి 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసింది.…
ఇటీవల ముంబైలో షిప్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఇప్పటికీ ఎన్‌సిబి అధికారుల అదుపులోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆదివారం షారూఖ్‌ని కలసి పరామర్శించారు. షారుఖ్ ఇంట్లో సల్మాన్ దాదాపు గంట టైమ్ స్పెండ్ చేశాడు. ఆర్యన్ అరెస్టుకు సంబంధించి షారూఖ్ ని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్, షారూఖ్ మంచి…