Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయలేదని, ఆయన జైలుకు వెళ్లినా.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని పార్టీ చెబుతోంది.
Himanta Biswa Sarma : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. అరెస్టును కేజ్రీవాల్ స్వయంగా ఆహ్వానించారని ఆయన అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఢిల్లీ పోలీస్ అధికారి తీరుపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపిన ఒక రోజు తర్వాత శనివారం సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు తీహార్ జైలుకు వచ్చిన కేజ్రీవాల్‌కు "స్వాగతం" అని సుకేష్ చంద్రశేఖర్ చెప్పాడు. "నిజం గెలిచింది, నేను అతన్ని తీహార్ జైలుకు స్వాగతిస్తున్నాను" అని సుకేష్ చంద్రశేఖర్ అన్నారు.
AAP: ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ జెపి నడ్డాను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
ED Raids : ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో మరో పార్టీ ఎమ్మెల్యేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ చర్యలు తీసుకుంది. ఆప్‌కి చెందిన మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై ఈడీ పట్టు బిగించింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. 10 రోజుల కస్టడీ కోరుతూ ఈ రోజు రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని, సౌత్ లాబీకి ప్రయోజనం చేకూరే విధంగా పాలసీని రూపకల్పన చేశారని, దీంట్లో వచ్చిన డబ్బును గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ కోర్టు ముందు వెల్లడించింది.