Sunitha Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ శుక్రవారం తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియోను విడుదల చేస్తూ సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తన కొత్త ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
AAP Minister Atishi : ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ సమయంలో ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి మర్లెనా ఈడీ పై ప్రశ్నలు లేవనెత్తారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లోక్ సభ ఎన్నికలకు ముందు ఐటీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయటం లాంటి అంశాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి రియాక్ట్ అయింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై కేజ్రీవాల్ సతీమణి సునీతా తీవ్ర ఆరోపణలు చేశారు. కస్టడీలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను వేధిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తీవ్రంగా వేధిస్తున్నారంటూ మీడియాకు తెలియజేశారు.
Arvind Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఆయన అరెస్టుపై ఇటీవల జర్మనీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. పూర్తిగా భారత అంతర్గత విషయంపై వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అంతే ధీటుగా భారత విదేశాంగ మంత్రిత్వశాఖ జర్మనీని హెచ్చరించింది. జర్మనీ సీనియర్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం తర్వాత ఈ విషయంలో జర్మనీ తన స్వరాన్ని మార్చింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి చుక్కెదురైంది. ఆయన కస్టడీని పొడగించాలని ఈడీ కోరుతుండటంతో రౌస్ ఎవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది. ఈడీ మరో 7 రోజులు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు మరో 4 రోజులు కస్టడీని పొడగించింది.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ నేటితో ముగుస్తుంది. దీంతో కేజ్రీవాల్‌ను నేటి మధ్యాహ్నం 2 గంటలకు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ అరెస్టుపై తాజాగా అమెరికా విదేశాంగ ప్రతినిధికి సామాన్లు జారీ చేసిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధించి న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ సకాలంలో, అలాగే పారదర్శకంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది.. అరవింద్ క్రేజీవాల్ అరెస్టును సహా అనేక చర్యలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని.. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. ఈ విషయం సంబంధించి ఢిల్లీలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ…
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గురువారం దీనిపై న్యాయస్థానం విచారించనుంది.