Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి చుక్కెదురైంది. ఆయన కస్టడీని పొడగించాలని ఈడీ కోరుతుండటంతో రౌస్ ఎవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది. ఈడీ మరో 7 రోజులు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు మరో 4 రోజులు కస్టడీని పొడగించింది. ఏప్రిల్ 1 వరకు ఆయన రిమాండ్‌ని పొడగించింది. కేజ్రీవాల్ భార్యకు చెందినదిగా భావిస్తున్న ఒక ఫోన్‌లోని డాటాను వెలికితీసినట్లు, విశ్లేషిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. మార్చి 21న కేజ్రీవాల్ నివాసం నుంచి సీజ్ చేసిన 4 డిజిటల్ డివైజెస్ నుంచి ఇంకా సమాచారం సేకరించలేదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ ఈ వివరాలను అందించడానికి తన న్యాయవాదులను సంప్రదించేందుకు సమయం కోరారు.
Read Also: Arvind Kejriwal: లిక్కర్ కేసులో నా పేరు లేదు.. ఇది రాజకీయ కుట్ర
మార్చి 21న కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయగా ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజుతో కస్టడీ ముగుస్తుండటంతో మరో 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. చివరకు 4 రోజులకు కోర్టు అనుమతించింది. ఇదిలా ఉంటే ఈడీ కావాలనేే ఈ కుట్రలో ఇరికిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ, సీబీఐ ఛార్జిషీట్‌లో తన పేరు ఎక్కడా లేని ప్రస్తావించారు. ఈడీ రెండు లక్ష్యాలతో పనిచేస్తోందని తనను లిక్కర్ కేసులో ఇరికించడంతో పాటు, ఆప్ పార్టీని మూసేయాలని చూస్తోందని కోర్టులో చెప్పారు. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఈ కేసులో ఈడీ ఆరోపిస్తున్నట్లు రూ. 100 కోట్లలో డబ్బులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఈడీ కావాల్సినన్ని రోజుల తనను కస్టడీలో ఉంచుకోవచ్చని అన్నారు.