Hardeep Singh Puri: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న కోర్టు మరోసారి ఆయనకు ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీని విధించింది. ఇదిలా ఉంటే తాజా పరిణామాలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ని ‘లిమిటెడ్ టైమ్’ ఉన్న వ్యక్తిగా విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సతీమణి సునీతా కేజ్రీవాల్ త్వరలో అత్యున్నత పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. ‘‘కేజ్రీవాల్ భార్య రెవెన్యూ సర్వీసెస్‌లో సహోద్యోగి మాత్రమే కాదు. వారు అందరిని పక్కన పెట్టారు. ఇప్పుడు మేడం అత్యన్నత పదవికి సిద్ధమవుతున్నారు’’ అని ఢిల్లీలో మీడియాతో అన్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కి చైనా షాక్.. ఆత్మాహుతి దాడితో కీలక ప్రాజెక్టులు నిలిపివేత..
కేజ్రీవాల్ తొమ్మిది సార్లు ఈడీ సమన్లకు సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత ఈడీ అధికారులు అతడి ఇంటికి వెళ్లారని, కేజ్రీవాల్‌కి సమయం చాలా తక్కువగా ఉందని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. మరోవైపు చట్టబద్ధమై టాక్స్ డిమాండ్‌పై కాంగ్రెస్ నిరసన చేస్తోందని కేంద్రమంత్రి విమర్శించారు. ప్రతీ ఒక్కరూ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందే అని, వారి ఆదాయం కూడా పెరిగిందని కాంగ్రెస్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రోజు కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మూడో వీడియో ప్రకటన చేశారు. ‘‘కేజ్రీవాల్ కో ఆశీర్వాద్’’ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె దీని కోసం వాట్సాప్ నెంబర్ షేర్ చేశారు. కేజ్రీవాల్ కోసం మెసేజెస్ పంపాలని ప్రజల్ని కోరారు.