Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల మోడ్‌లోకి వచ్చారు. సెప్టెంబర్ 22న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ జంతాకీ అదాలత్‌ను నిర్వహించనుంది.
Delhi New CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 21వ తేదీన అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషితో ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయుంచనున్నారు.
MP Sanjay Singh: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేస్తారని.. ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకుంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈరోజు (బుధవారం) తెలిపారు.
Swati Maliwal: ఢిల్లీకి కాబోతున్న కొత్త ముఖ్యమంత్రి అతిషీపై, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాజీనామా చేస్తున్న తరుణంలో కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషీని ఎన్నుకున్నారు. అయితే, ఆమెపై అదే పార్టీకి చెందిన స్వాతి మలివాల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడి నిందితుడు అఫ్జల్ గురుకి ఉరిశిక్షని నిలిపేయాలని పోరాడిన కుటుంబం అతిషీది అని ఆమె అన్నారు.
Atishi: ఢిల్లీ లిక్కర్ కేసులో నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఈ రోజు జరిగిన ఆప్ శానససభ పక్ష సమావేశంలో ఢిల్లీకి కొత్త సీఎంగా అతిషీ మార్లేనాని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఖరారైన తర్వాత తొలిసారిగా అతిషీ స్పందించారు. కేజ్రీవాల్‌ని తన గురువుగా అభివర్ణించారు. తదుపరి ఎన్నికల్లో కేజ్రీవాల్‌ని సీఎం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
Delhi New CM : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత స్వయంగా ఆమె పేరును ప్రతిపాదించగా,
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ప్రముఖంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీ రోల్ పోషించిన పేర్లు వినిస్తున్నాయి.
Delhi : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తానని చెప్పారు. దీని తర్వాత ఢిల్లీ ప్రభుత్వ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన రాజకీయాల్లో సంచలనంగా మారింది. రెండు రోజు తర్వాత తాను రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలు తనను నిజాయితీపరుడని తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే, కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ ఎద్దేవా చేస్తున్నాయి. రెండు రోజుల తర్వాత రాజకీనామా చేయాల్సిన అవసరం ఏంటని, ఇప్పుడే చేయొచ్చు కదా.. అంటూ సెటైర్లు వేస్తున్నాయి.
Delhi CM : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో పాటు ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.