ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే ప్రముఖంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీ రోల్ పోషించిన పేర్లు వినిస్తున్నాయి. సీఎం రేసులో ప్రధానంగా సునీతా కేజ్రీవాల్, రాఘవ్ చద్దా, అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లు ప్రముఖంగా వినిస్తున్నాయి. వీరితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నలుగురిలో ఎవరికొకరికి అవకాశం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలంటే.. చాలా కీలకంగా వ్యవహారించాలి. దీంతో కేజ్రీవాల్ ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: TG Govt: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెలలోనే జారీ..!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఆయన పలుమార్లు బెయిల్‌కు అప్లై చేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ వేడిలోనే ప్రభుత్వం రద్దైతే.. తనను కేంద్రం ఇబ్బంది పెట్టి.. జైల్లో పెట్టిన విషయం ప్రజలకు గుర్తుంటుందని కేజ్రీవాల్, ఆప్ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. వీటితో పాటే ఢిల్లీ ఎన్నికలు జరిగితే ప్రజల నుంచి సానుభూతి పొందవచ్చని ఆప్ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Ramnagar Bunny : ఆసక్తికరంగా రామ్ నగర్ బన్నీ టీజర్.. చూశారా?