Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ పిటిషన్‌లో సవాలు చేశారు.
Liquor Policy Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్ పాఠక్‌లకు సమన్లను జారీ చేసింది.
Swati Maliwal Assault Case: లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోనే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మే 13న దాడి జరిగితే మే 18న బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Delhi: వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే, తాజాగా ఆ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ అగ్ర నేతలు రాంవీర్ సింగ్ బిధూరి, అరవిందర్ సింగ్ లవ్లీ, యోగేంద్ర చందోలియా సమక్షంలో వారంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
Arvind Kejriwal Bail: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపశమనం లభించలేదు. మరికొంత కాలం ఆయన జైల్లోనే వేచి చూడాల్సిందే. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సెప్టెంబర్ 5కి వాయిదా పడింది.
Arvind Kejriwal Bail: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తుపై సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సోమవారం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్‌ను పరిశీలించేందుకు కోర్టు నిరాకరించింది.