Arvind Kejriwal: కాలుష్యం నుంచి ప్రజల్ని రక్షించేందుకు బాణాసంచాపై నిషేధం అవసరమని, ఇందులో హిందూ-ముస్లిం కోణం లేదని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అన్నారు. దీపావళి రోజు ఫైర్ క్రాకర్స్ కాల్చకుండా దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని కోరారు. ‘‘మనం ఇతరులకు ఏదైనా ఉపకారం చేస్తు్న్నామని కాదు, మనం మనకు మేలు చేసుకుంటున్నాము. ఎందుకంటే పటాసులు కాల్చడం వల్ల కాలుస్యంతో బాధపడుతాము’’ అని అన్నారు. Read Also: Naga Vamsi: అందుకే లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు..…
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని జహంగీర్‌పురిలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నిన్న నేను ఢిల్లీలోని వికాస్‌పురికి వెళ్లానని, అక్కడ బీజేపీ.. గూండాలను పంపి నన్ను చంపేందుకు ప్రయత్నించింది. నాపై దాడి చేశారు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయండి.
AAP: మహారాష్ట్రలో వచ్చే నెల జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పోటీ చేయడం లేదని ప్రకటించింది. మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ-ఎస్పీ, ఉద్ధవ్ ఠాక్రే సేవ కోసం ప్రచారం చేస్తారని ఆ పార్టీ నే సంజయ్ సింగ్ శనివారం చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్ పవార్)-ఉద్ధవ్ ఠాక్రే శివసేన ‘‘మహా వికాస్ అఘాడీ(MVA)’’ పేరుతో కూటమిగా పోటీ చేస్తున్నాయి.
Delhi: ఢిల్లీలో యమునా నది కాలుష్యానికి కేరాఫ్‌గా మారింది. విషపూరిత నురగ యమునా నదిలో ప్రవహిస్తోంది. ఇదిలా ఉంటే యమునాలో ఎలాంటి కాలుష్యం ఉందో, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా చేసిన ప్రయత్నం.. ఆయనను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది.
ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మోడీ డిగ్రీపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తీహార్ జైల్లో తనను చంపేందుకు బీజేపీ కుట్ర చేసిందని మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. పార్టీ ప్రజా ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్నప్పుడు తనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు నిరాకరించారని.. సకాలంలో ఇంజెక్షన్ తీసుకోకపోతే చనిపోయే అవకాశం ఉందని తెలిపారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ఆప్ పార్టీ నేత ఇంట్లోకి మకాం మార్చారు. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ నివాసాన్ని ఖాళీ చేసి లుటియన్స్ జోన్‌లోని కొత్త చిరునామాకు మారారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ అధికారిక నివాసాన్ని శుక్రవారం ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకెళ్లి.. అనంతరం ఆరు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఆ సీటులో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.