దేశ రాజధానిలోని రోడ్ల పరిస్థితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం పరిశీలించారు. అనంతరం దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతల రోడ్లను గుర్తించి మరమ్మతులు, రిపేర్లకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది
Aravind Kejriwal : ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఇంటి కోసం అన్వేషణను ముమ్మరం చేశారు. త్వరలోనే ఆయన సీఎం నివాసాన్ని ఖాళీ చేస్తారని చెబుతున్నారు.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ కుర్చీ మారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ సీటు సంఖ్య 1 నుంచి 41కి మారింది.
Delhi CM: నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీలు సిద్ధమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది.
Aravind Kejriwal : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. తన పదవీ విరమణ సహా 5 అంశాలపై సమాధానం చెప్పాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
Atishi: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిషీ మర్లెనా ఈరోజు (సోమవారం) బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన ఓ కుర్చీని ఉంచడంతో పాటు తాను వేరే సీట్లో కూర్చోని బాధ్యతలు చేపట్టారు.
నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే ఫస్ట్ టైం.
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత.. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా 'అతిషి' ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.