అక్షయ్ కుమార్‌తో సక్సెస్ దోబూచులాడుతోంది. ప్రయోగాల జోలికి వెళ్లినా అలవాటైన ఫన్ యాంగిల్లోకి షిఫ్టైనా, మల్టీస్టారర్లతో వస్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం రావట్లేదు. అయినా సరే నేను తగ్గా అంటూ పట్టువదలని విక్రమార్కుడిలా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మరోసారి సక్సెస్ ఫుల్ సీక్వెల్‌నే నమ్ముకున్నాడు. సీక్వెల్స్ చిత్రాలే కలిసొస్తున్నాయని వరుసగా ఫ్రాంచైజీ చిత్రాలతో కాలక్షేపం చేస్తున్నాడు అక్షయ్ కుమార్. రీసెంట్ టైమ్స్‌లో ఆయన స్ట్రెయిట్ చిత్రాల కన్నా సీక్వెల్స్‌తోనే పలకరించింది ఎక్కువ. Also…
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి…