అక్షయ్ కుమార్‌తో సక్సెస్ దోబూచులాడుతోంది. ప్రయోగాల జోలికి వెళ్లినా అలవాటైన ఫన్ యాంగిల్లోకి షిఫ్టైనా, మల్టీస్టారర్లతో వస్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం రావట్లేదు. అయినా సరే నేను తగ్గా అంటూ పట్టువదలని విక్రమార్కుడిలా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. మరోసారి సక్సెస్ ఫుల్ సీక్వెల్‌నే నమ్ముకున్నాడు. సీక్వెల్స్ చిత్రాలే కలిసొస్తున్నాయని వరుసగా ఫ్రాంచైజీ చిత్రాలతో కాలక్షేపం చేస్తున్నాడు అక్షయ్ కుమార్. రీసెంట్ టైమ్స్‌లో ఆయన స్ట్రెయిట్ చిత్రాల కన్నా సీక్వెల్స్‌తోనే పలకరించింది ఎక్కువ.
Also Read : PMF : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై కేసు నమోదు.. డైలమాలో రాజాసాబ్ రిలీజ్
సింగం ఎగైన్ నుండి హౌస్‌ఫుల్ 5 వరకు వచ్చిన మూడు చిత్రాలు కూడా సీక్వెల్ చిత్రాలే. కానీ ఏవీ బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయలేదు. స్ట్రైట్ కథలదీ కూడా ఇదే సిచ్యుయేషన్. స్కై ఫోర్స్ కానీ, టాలీవుడ్ ఎంట్రీ మూవీ కన్నప్ప కానీ సోసో అనిపించుకున్నాయి. అక్షయ్ సీక్వెల్ సినిమాలతోనే కాదు సోలో హీరోగానూ రాలేకపోతున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన కాప్ యూనివర్శ్ సింగం ఎగైన్, స్కై ఫోర్స్, హౌస్ ఫుల్5, కన్నప్ప లాంటి సినిమాలన్నీ మల్టీస్టారర్సే. కేసరి చాప్టర్2లో సోలో ఫెర్మామెన్స్ చూపించగలిగాడు. కానీ సినిమా అంతగా ఆడలేదు. అయినా సరే మల్టీస్టారర్, సీక్వెల్స్ చేస్తూనే ఉన్నాడు అక్షయ్. జాలీ వన్, జాలీ2 కలిస్తే కోర్టు రూమ్ ఎలా ఉండబోతుందో జాలీ ఎల్ఎల్బీ3తో ఫన్నీగా చూపించబోతున్నాడు దర్శకుడు సుభాష్ కపూర్. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ఇప్పటికే బచ్చన్ పాండేలో కాస్త ఫన్ మోడ్‌లో కనిపించిన ఈ ఇద్దరు మరోసారి ఆడియన్స్ ఫేసుల్లో స్మైల్స్ తెప్పిచేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 19న రిలీజ్‌కి డేట్ లాక్ చేసుకుంది జాలీ ఎల్ఎల్బీ3. బచ్చన్ పాండేతో సక్సెస్ మిస్ ఫైర్ అయిన ఈ జోడీ ఈ ప్రాజెక్టుతోనైనా హిట్ కొడుతుందేమో చూడాలి.