ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల తేవర్ బార్‌లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూమ్‌లో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, ఆపిల్ లాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.
నార్వే యువరాణి మెట్టే మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ(27) అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. రేప్ కేసులో హోయిబీని సోమవారం ఓస్లోలో పోలీసులు అరెస్ట్ చేశారు.
West Bengal Violence: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.
బెంగళూరులో గత 12 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన రంజాన్ షేక్ (38) అలియాస్ మహమ్మద్ రంజాన్ షేక్‌ను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లోని నారైల్ నివాసిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంజాన్ షేక్ 2012 నుంచి బెంగళూరులోని చిక్క బనహళ్లిలో నివాసం ఉంటూ చెత్త వ్యాపారం చేస్తున్నాడు. అతడి వద్ద నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఇండియన్ పాస్‌పోర్ట్ కూడా ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్రా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ధూల్‌పేట్‌కు చెందిన గీతాబాయ్, శీలాబాయ్, క్రాంతిలను అరెస్ట్ చేశారు.
Bengaluru: కర్ణాటక రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఉత్తర తాలూకాలో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి లోన్ చెల్లించలేదని అతని మైనర్ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బీహార్‌లోని సివాన్, సరన్, గోపాల్‌గంజ్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి మరణించిన కేసుల్లో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, ఏడుగురు మహిళలు సహా 21 మందిని అరెస్టు చేశారు.
తనను ఇరికిస్తానని బెదిరించి రూ.2.5 కోట్లు డిమాండ్ చేసిన ఎన్ఐఏ డీఎస్పీ అజయ్ ప్రతాప్ సింగ్ సహా ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ వివరాల ప్రకారం.. బీహార్ రాజధాని పట్నాలో ఎన్ఐఏ యూనిట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)గా పని చేస్తున్న అజయ్ ప్రతాప్‌సింగ్..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని కిథోర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు విలాసవంతమైన కార్ల దొంగతనం ముఠాలో సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసి రూ.300 కోట్లకు పైగా దండుకున్న వ్యక్తిని మధుర నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సన్యాసి వేషంలో మధురలో తలదాచుకున్నాడు.