Bangladesh: బంగ్లాదేశ్ సైన్యంలో ఏదో జరుగుతోంది. సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఏకంగా 14 మంది కీలక సైనిక అధికారులను అరెస్ట్ చేయడంతో పాటు, మేజర్ జనరల్ అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. నివేదికల ప్రకారం, అక్టోబర్ 08న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ICT) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది.