చిత్రపరిశ్రమలో మీటూ ఉద్యమం ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో అందరికి తెలుసు. హీరోయిన్లపై హీరోలు, దర్శకనిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఈ ఉద్యమం మొదలయ్యింది. ఈ మీటూ ఉద్యమంలో ఎంతమంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులు బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమం నడిచేటప్పుడే కోలీవుడ్ హీరోయిన్ శృతి హరిహరన్, స్టార్ హీరో అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించింది. షూటింగ్ సమయంలో తనను అసభ్యంగా తాకుతూ, కౌగిలించుకోవడానికి ట్రై చేశాడని…
మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మరక్కార్.. అరేబియా సముద్ర సింహం’. మలయాళ దర్శకుడు దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంతోమంది అగ్రతారలు నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శిని, కీర్తి సురేష్, సిద్ధిఖ్, సురేశ్ కృష్ణ , ప్రణయ్ మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా…
(ఆగస్టు 15న అర్జున్ జన్మదినోత్సవం) పోరాట సన్నివేశాల్లో తనదైన బాణీ పలికిస్తూ ‘యాక్షన్ కింగ్’ అనిపించుకున్నారు అర్జున్ సర్జా. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినిమా రంగానికి చెందినవారే. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్న అర్జున్ స్వాతంత్ర్య దినోత్సవాన జన్మించడం వల్ల తనలో దేశభక్తిని నింపుకొనీ చిత్రాలను రూపొందించారు. ఆయన చేతిపై మన మువ్వన్నెల జెండా పచ్చబొట్టు కూడా కనిపిస్తుంది. తెలుగునాట ‘మా పల్లెలో గోపాలుడు’గా అవతరించకముందే కొన్ని కన్నడ అనువాద చిత్రాల ద్వారా అర్జున్ తెలుగువారికి…
నటుడు అర్జున్ సర్జా చెన్నైలో హనుమాన్ ఆలయాన్ని ఇటీవల నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఆలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. వేద పండితుల నడుమ ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంజనేయస్వామికి పరమ భక్తుడైన అర్జున్ చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన సొంత స్థలంలో అర్జున్ ఈ ఆలయాన్ని అద్భుతంగా నెలకొల్పారు. ఆలయం ప్రారంభోత్సవం కావడంతో భక్తులు భారీగా వచ్చి దర్శించుకున్నారు.
విశ్వనటుడు కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ద్రోహి’. దేశానికే సవాలు విసురుతున్న టెర్రరిస్టు గ్రూపులను నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వేసే ఎత్తులు, జిత్తుల నేపథ్యంలో ఇవాళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటికీ మూలం ‘ద్రోహి’ అనే చెప్పాలి. రొటీన్ ఫిల్మ్ మేకింగ్ పాత్ ను బ్రేక్ చేస్తూ, కొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ కమల్ పాతికేళ్ళ క్రితమే ‘ద్రోహి’ని తీశారు. హిందీ చిత్రం ‘ద్రోహ్ కాల్’కు ఇది రీమేక్. అక్కడ ఓంపురి, నజీరుద్దీన్ షా ప్రధాన…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయింది. దుబాయ్ లో నెల రోజుల పాటు సాగిన భారీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది కానీ వెంటనే కరోనా ప్రభావం కారణంగా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇదిలా ఉంటే, సర్కారు వారి పాట విలన్ విషయంలో కన్ఫ్యూజన్ క్లారిటీ వచ్చినట్లు…