Vishwak Sen: తమిళ స్టార్ డైరెక్షన్‌లో సినిమా ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిఫరెంట్ జోనర్ సినిమాలతో తనదైన ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్.. రీసెంట్‌గా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఇది మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఇతనికి క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ యంగ్ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట! తన కూతురు ఐశ్వర్య అర్జున్‌నే ఇందులో కథానాయికగా నటింపజేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అర్జున్ సర్జా ఒక గొప్ప నటుడే కాదు, మంచి దర్శకుడు కూడా! ఈయన 1994లో ‘జై హింద్’ సినిమాకు దర్శకత్వం వహించాడు. అది తెలుగు, తమిళ భాషల్లో హిట్టయ్యింది. 2002లో బాలయ్య ‘నరసింహ నాయుడు’ చిత్రాన్ని ‘ఎళుమళై’గా రీమేక్ చేసి, విజయం సాధించాడు. 2014లో వచ్చిన ‘జై హింద్ 2’ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు తన దర్శకత్వంలో విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేసేందుకు యాక్షన్ కింగ్ రంగం సిద్ధం చేస్తున్నాడు. దీన్ని.. తెలుగు – తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇది పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోందని, దర్శకుడిగా తన ప్రతిభ చాటేందుకు యాక్షన్ కింగ్ ఈ సినిమాకి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యాడని ఇన్‌సైడ్ న్యూస్! త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుందని సమాచారం. ఇదిలావుండగా.. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విశ్వక్, త్వరలోనే హిందీలో దర్శకుడిగా తెరంగేట్రం చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టిన విషయం తెలిసిందే!
తాజావార్తలు
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!