యాక్షన్ కు మారుపేరు అర్జున్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 15న అర్జున్ జన్మదినోత్సవం)
పోరాట సన్నివేశాల్లో తనదైన బాణీ పలికిస్తూ ‘యాక్షన్ కింగ్’ అనిపించుకున్నారు అర్జున్ సర్జా. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినిమా రంగానికి చెందినవారే. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్న అర్జున్ స్వాతంత్ర్య దినోత్సవాన జన్మించడం వల్ల తనలో దేశభక్తిని నింపుకొనీ చిత్రాలను రూపొందించారు. ఆయన చేతిపై మన మువ్వన్నెల జెండా పచ్చబొట్టు కూడా కనిపిస్తుంది. తెలుగునాట ‘మా పల్లెలో గోపాలుడు’గా అవతరించకముందే కొన్ని కన్నడ అనువాద చిత్రాల ద్వారా అర్జున్ తెలుగువారికి సుపరిచితుడే. యాక్షన్ స్టార్ గా తెలుగునాట సైతం అర్జున్ జయకేతనం ఎగురవేశారు. అనేక చిత్రాలలో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో భళా అనిపించిన అర్జున్ ‘యాక్షన్ కింగ్’ గా నిలచిపోయారు.
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
కన్నడ చిత్రసీమలో కేరెక్టర్ యాక్టర్ గా ఎంతో పేరున్న నటుడు శక్తి ప్రసాద్. ఆయన అసలు పేరు జె.సి.రామస్వామి. స్వతహాగా ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేయడంతో తన తనయులు కిశోర్ సర్జా, అర్జున్ సర్జా ఇద్దరినీ యాక్షన్ హీరోలుగా తీర్చిదిద్దారు. ఈ ఇద్దరు తండ్రి పేరు నిలుపుతూ యాక్షన్ సీన్స్ లో నటించేవారు. కిశోర్ సర్జా డైరెక్టర్ గా కూడా రాణించారు. అర్జున్ యాక్షన్ సీన్స్ చూసిన కోడి రామకృష్ణ, నిర్మాత ఎస్ .గోపాల్ రెడ్డి తమ ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం మూడు థియేటర్లలో స్వర్ణోత్సవం జరుపుకుంది. దాంతో తెలుగు చిత్రసీమలోనూ అర్జున్ కు అవకాశాలు మొదలయ్యాయి. “టెర్రర్, బంగారు చిలక, నాగదేవత, ప్రతిధ్వని, కోటిగాడు, కోనసీమ కుర్రోడు, త్రిమూర్తులు, మొనగాడు” వంటి చిత్రాలతో తెలుగువారిని అలరించారు. తరువాత తెలుగులో ఫ్లాపులు పలకరించగానే, తమిళ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించారు అర్జున్. దర్శకుడు బి.గోపాల్ తొలి చిత్రం ‘ప్రతిధ్వని’లో కథానాయకునిగా నటించిన అర్జున్, తమిళ దర్శకుడు శంకర్ మొదటి సినిమా ‘జెంటిల్ మేన్’లోనూ హీరోగా అలరించారు. అలా కొందరు దర్శకులకు ఈ యాక్షన్ కింగ్ సెంటిమెంట్ గా మారారు. అర్జున్ భార్య నివేదిత కూడా నటి. ఆయన కూతురు ఐశ్వర్య కూడా కన్నవారి బాటలో పయనిస్తూ నటనను ఎంచుకుంది.
తెలుగులో కొంత గ్యాప్ తరువాత అర్జున్ తనకు తొలి ఘనవిజయం చూపించిన కోడి రామకృష్ణ ‘పుట్టింటికి రా చెల్లి’చిత్రంలో నటించారు . ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. అంతకు ముందు “ద్రోహి, శుభవార్త, శ్రీమంజునాథ” వంటి ద్విభాషా చిత్రాల్లోనూ అభినయించారు. జగపతిబాబుతో కలసి ‘హనుమాన్ జంక్షన్’లో నటించారు అర్జున్. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత నుంచీ అర్జున్, జగపతిబాబు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. “శ్రీఆంజనేయం, రామ రామ కృష్ణ కృష్ణ, లై, నా పేరు సూర్య”వంటి చిత్రాల్లోనూ అర్జున్ ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించారు. రవితేజ హీరోగా రూపొందిన ‘ఖిలాడీ’లోనూ అర్జున్ ఓ ముఖ్య పాత్ర ధరించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇలా తెలుగువారితో తన అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు అర్జున్. ఈ యేడాదితో 59 ఏళ్ళు పూర్తి చేసుకొని 60 ఏట అడుగు పెట్టనున్నారు. అయినా, ఇప్పటికీ అదే ఎనర్జీతో కనిపించే అర్జున్ ను చూస్తే రియల్ ‘యాక్షన్ కింగ్’ అనకుండా ఉండలేం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..