ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందని రోగులు వాటిని ఆశ్రయిస్తుంటారు. కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంతో కాన్పుకోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో గత ఏడాది జరిగిన ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీన కాన్పు కోసం చేరిన బొంతు సునీత అనే మహిళ ఆస్పత్రికి వచ్చింది. కాన్పు కోసం సర్జరీ కిట్ బయట…