Shashtipoorthi : నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఆయన వందకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు. 1986లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘లేడీస్ టైలర్’లో అర్చనతో కలిసి ఆయన నటించారు. ఆ జంట కలయికలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు 38 ఏళ్ల తర్వాత ఈ జంట ‘షష్టిపూర్తి’ అనే ఫ్యామిలీ డ్రామాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి…
పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్ TTలో భారత్ ఉమెన్స్ జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి.
ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట మూడ్రోజుల క్రితం బిగ్‌బాస్-16 ఫేమ్ మోడల్, నటి అర్చన గౌతంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె ఎట్టకేలకు నోరు విప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీని కలిసేందుకు తండ్రితో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లానని ఆమె తెలిపారు. వారిని అభినందించడానికే అక్కడికి వెళ్లినట్లు పేర్కొ్న్నారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగినట్లు…
అలనాటి 'లేడీస్ టైలర్' జంట ఇప్పుడు 'షష్టి పూర్తి' సందర్భంగా మరోసారి ఒక్కటైంది. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రాబోతున్న 'షష్టిపూర్తి' చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్ కుమార్, ఆకాంక్షసింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘చోర్ బజార్’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించబోతోంది నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు దీనిని నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అర్చన మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ళుగా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం చెబుతూ, ”నేను సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి…
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లందరూ రీ ఎంట్రీల మీద పడ్డారు. ఒకప్పుడు తమ అందం, అభినయాలతో అలరించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు స్టార్ హీరోలకు అమ్మలుగా, అత్తలుగా కనిపించి మెప్పిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి లిస్టులోకి చేరిపోయింది సీనియర్ నటి అర్చన. నిరీక్షణ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అర్చన భారత్ బంద్, లేడీస్ టైలర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందులో ఆమె నటించిన తీరు…
బిగ్ బాస్ ఫేమ్ అర్చన టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘అవలంబిక’. సుజయ్, మంజూష పొలగాని ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో జి. శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. సోషియో ఫాంటసీ హారర్ చిత్రంగా దర్శకుడు దీనిని మలిచాడని, అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన ఈ సినిమాను ఇదే నెల 20న విడుదల చేయబోతున్నామని నిర్మాత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవల నాగబాబు మూవీ ట్రైలర్ ను విడుదల చేశారని, దానికి మంచి…
నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నలుపుతోనూ వలపుగేలం వేయవచ్చుననీ కొందరు నిరూపించారు. నలుపున్నా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గెలుపు చూసిన మేటి నటి అర్చన. ఎలా ఉంటేనేం? అర్చన అభినయంలో ఓ అందం ఉండేది. ఆ చూపుతోనే బంధాలు వేసే శక్తీ ఆమె సొంతమే! వాటిని మించి సుగంధాల వాసనలాంటి లావణ్యం అర్చనలో తిష్టవేసుకుంది. ఇన్ని లక్షణాలున్న తరువాత నలుపు, తెలుపుతో పనేంటి!? అర్చనను ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ ఎందరో కీర్తించారు. వరుసగా రెండు సార్లు జాతీయ…