Sri Satyasai Movie : ‘శ్రీసత్యసాయి అవతారం’ షూటింగ్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీపుట్టపర్తి సత్యసాయిబాబాను భక్తులు కదిలే దైవంగా చూస్తారు. ఆయన గురించి ఇప్పటి తరానికి, రాబోయే తరానికి తెలియ జేయాలనే సంకల్పంతో ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో సాయివేదిక్ ఫిలింస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. విజయదశమి పర్వదినాన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. సాయిప్రకాష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆయనకు 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భక్తులు డాక్టర్ దామోదర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్ నివ్వగా, కె. అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ స్విచ్ఛాన్ చేశారు. ఎస్.వి. కృష్ణారెడ్డి తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. నర్సాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సి.హెచ్. మధన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయగా, సాయికుమార్, సుమన్, బాబూమోహన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
Also Read
ఈ సందర్భంగా పాత్రికేయులతో దర్శకుడు సాయిప్రకాష్ మాట్లాడుతూ ‘బాబాగారికి 180 దేశాలలో భక్తులు ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమాకు దర్శకత్వ అవకాశం నాకు రావడం కూడా ఆయన దయ. స్వామి ఎప్పుడూ అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి అని చెపుతూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. మానవ సేవయే మాధవ సేవ అనే గొప్ప విషయం ఇందులో ఇమిడి ఉంది. ఇందులో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 400 మంది నటీనటులు నటించబోతున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం’ అన్నారు. పృథ్వి, అర్చన, కోటా శంకర్రావు, బాబూ మోహన్, అశోక్ కుమార్, శివపార్వతి తాము ఈ సినిమాలో భాగం అవుతున్నామని అన్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!