ఆరడగుల అందం, పసిమిఛాయ, చూడగానే ఆకట్టుకొనే రూపం, విలక్షణమైన చిరునవ్వు అరవింద్ స్వామి సొంతం. తెరపై అరవింద్ స్వామిని చూడగానే ఎందరో ముద్దుగుమ్మలు మనసు పారేసుకున్నారు. శ్రీదేవి లాంటి అందగత్తె సైతం ఈ అరవిందుని చేయి అందుకోవాలని ఒకానొక సమయంలో ఉవ్విళ్ళూరింది. దీనిని బట్టే అప్పట్లో అరవింద స్వామి క్రేజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు అరవింద్ స్వామి. అరవింద్ స్వామి 1970 జూన్ 18న చెన్నైలో…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘తలైవి’. పురచ్చి తలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఎ. ఎల్. విజయ్ దర్శకత్వంలో విబ్రి మీడియా, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు జూన్ 22న పూర్తయ్యాయి. తాజాగా హిందీ వర్షన్ సెన్సార్ సైతం పూర్తయింది. తమిళంలో…
పురచ్చి తలైవి జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 10వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు విష్ణు వర్థన్, శైలేష్ ఆర్ సింగ్ తెలిపారు. జయలలితగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించగా, ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ లభించింది. గత యేడాది జూన్ 26న ఈ సినిమా విడుదల…
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ తమిళం తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అరవింద స్వామి ఎఐఎడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దిగ్గజ నటుడు ఎంజీఆర్ గా కనిపించబోతున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి…