రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అరసవల్లి దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నామని… దీనిపై పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి వున్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… ఇక, అరసవల్లి సూర్యదేవుని జయంతి ఉత్సవాలును అధికారులు విజయవంతంగా నిర్వహించారిన ప్రశంసించారు.. మరోవైపు ముఖ్యమంత్రి…