Roopa vs Rohini: కర్ణాటకలో కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇద్దరు తమ పదవులను మరిచి సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా విమర్శలకు దిగడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరికి పోస్టింగులు ఇవ్వలేదు.
Roopa vs Rohini: కర్ణాటకలో ఇద్దరు మహిళా సివిల్ అధికారుల మధ్య వార్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. కర్ణాటక దేవాదాయ కమిషనర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై కర్ణాటక హస్తకళల అభివృద్ధి మండలి మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ రూపా డి. మౌద్గిల్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఫేస్ బుక్ వేదికగా రూపా, రోహిణి ఫోటోలు షేర్ చేసి ఆరోపణలు చేశారు.