బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అవకాశాలు తగ్గడానికి పలు కారణాలు ఉండొచ్చని, అందులో మతం కూడా ఒక కారణం అయి ఉండవచ్చేమో అనే భావన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బాలీవుడ్ వర్గాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు మద్దతు తెలపగా, మరికొందరు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రెహమాన్ వ్యాఖ్యలను కొంతమంది బాలీవుడ్…