మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు బైక్‌లంటే ఎంతో ఇష్టం.. అప్పుడప్పుడు ఖరీదైన బైక్‌లపై హైదరాబాద్‌లో చక్కర్లు కొట్టేస్తుంటాడు.. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు. ఇక, ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు.. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్.. మూడు ఇంజిన్ల ఉండటం ఈ బైక్ ప్రత్యేకత.. దీనిని లగ్జరీ బైక్‌లకు పేరుగాంచిన ట్రయంప్ సంస్థ తయారు చేసింది. ఈ…
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయిధరమ్ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సాయితేజ్ శరీరంలో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని, కాలర్‌బోన్ విరిగిందని పేర్కొన్నారు. ఆయన ఇంకా 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని… ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.. తప్పనిసరిగా కోలుకుంటారాన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు అపోలో వైద్యులు. కాగా, నిన్న రాత్రి…
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలయ్యాయి… ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మంద కృష్ణ… ఓ ప్రైవేట్ హోటల్‌లో దిగారు.. అయితే, హోటల్ గదిలోని బాత్‌రూమ్‌లో జారిపడ్డ మందకృష్ణ మాదిగకు స్వల్ప గాయాలు అయినట్టు చెబుతున్నారు.. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు ఆయన అనుచరులు… ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.
హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బీజేపీ నేత ఈటల రాజేందర్… వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.. పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు ఈటల ప్రకటించారు.. మరోవైపు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించగా.. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాఘునందర్‌రావు పరామర్శించారు.. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన తర్వాత మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్… ఈటల ఆరోగ్య…
తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు.. ప్రజాదీవెన పేరుతో పాదయాత్రను ఈ నెల 19న కమలాపూర్ మండలం నుంచి ప్రారంభించిన ఆయన.. 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. ఇక, ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు.. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు.. దీంతో వైద్య పరీక్షలు…