మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు బైక్‌లంటే ఎంతో ఇష్టం.. అప్పుడప్పుడు ఖరీదైన బైక్‌లపై హైదరాబాద్‌లో చక్కర్లు కొట్టేస్తుంటాడు.. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు. ఇక, ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు.. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్.. మూడు ఇంజిన్ల ఉండటం ఈ బైక్ ప్రత్యేకత.. దీనిని లగ్జరీ బైక్‌లకు పేరుగాంచిన ట్రయంప్ సంస్థ తయారు చేసింది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 16 షోరూమ్‌లు మాత్రమే ఉన్నాయి.
అయితే ట్రయంప్ కంపెనీకి చెందిన ఈ స్పోర్ట్స్ బైక్‌ను కొద్దిరోజుల క్రితమే హీరో సాయిధరమ్ తేజ్ స్వయంగా హైదరాబాద్‌లో లాంచ్ చేశారు.. అప్పుడే ఈ బైక్‌పై మనసు పారేసుకున్నాడు మెగాహీరో.. ఆ బైక్ కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు.. అప్పటి వీడియోలు, ఫొటోలు ఇప్పుడు బయటకు తీస్తున్నారు ఫ్యాన్స్.. ఇక, మొత్తానికి ఆ బైక్‌ను కొనుగోలు చేసి వాడుతున్నాడు తేజ్.. అప్పుడప్పుడు హైదరాబాద్ రోడ్లపై ట్రయంప్ బైక్‌పై చక్కర్లు కొట్టేవాడు.. ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదానికి గుర్యాడు సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనా ఇప్పటికే వైద్యులు వెల్లడించారు..