ఏపీలో కాంగ్రెస్ పార్టీని సమర్ధంగా నడిపించే నాథుడెవరు? కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చిందా? కాంగ్రెస్ ఆలోచనేంటి? రేసులో ముందున్నది ఎవరు? ఈ ప్రశ్నల్నిటికి సమాధానం రాబోతోంది. ఏపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు నియామకం కొలిక్కి వచ్చింది. ఫ్రంట్ రన్నర్ గా మాజీ ఎంపీ డా.చింతామోహన్ వున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలపై నివేదిక ను సిధ్దం చేయనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీ. సమర్ధుడు, విధేయుడు, సమన్వయంతో…
ఏపీ కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చి ముందుకు నడిపించే సారథి కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఏపీసీసీ చీఫ్ మార్పుపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పుపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ. ఏపీసీసీ చీఫ్ పదవికి రేసులో ఐదుగురు నేతలు వున్నారని తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ హర్షకుమార్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర…