ఆంధ్రప్రదేశ్ కు రాజధాని వివాదం ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి. మధు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం అమరావతిలో తిరిగి నిర్మాణాలు ప్రారం భించి వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. రాజధానిగా అమరా వతిని వివాదం చేయోద్దని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలి పారు. ప్రజా ఆందోళనలతో కేంద్రంలోని బీజేపీ మూడు నల్ల చట్టా లను రద్దు చేయాలన్సి వచ్చిందని చెప్పారు.…
ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు శపథం చేసి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు. రెండున్నరేళ్లుగా అన్ని విధాలా అవమానిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. నేను ప్రజల కోసమే పోరాటం చేశా. ఓడిపోయినపుడు కుంగిపోలేదు…గెలిచినపుడు రెచ్చిపోలేదు. ప్రతిపక్ష నేతలను నేనెప్పుడూ అగౌరవపరచలేదన్నారు చంద్రబాబు. తాను సీఎంగానే మళ్ళీ అడుగుపెడతానని శపథం చేశారు చంద్రబాబు. మరి ఏపీ రాజకీయాలు భవిష్యత్తులో ఎలా మారతాయో చూడాలి. ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో…