విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తాం అని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి పాటుపడతాం అని తెలిపారు. నేడు విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అథిదులుగా హజరయ్యారు. ఈ ఇద్దరిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఆత్మీయ సమావేశం సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు దేశరాజధాని ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు బయల్దేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎంను టీడీపీ నేతలు కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా ఐదుగురు కేంద్ర మంత్రులను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. వారి దృష్టికి పలు ముఖ్యమైన అంశాలను తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్లో…
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు విజయవంతమైంది. విరిగిపోయిన గేటు దగ్గర మూడో ఎలిమెంట్‌ను అమర్చారు. ఇప్పటి వరకు 3 ఎలిమెంట్లను విజయవంతంగా సాంకేతిక నిపుణుల బృందం పూర్తి చేసింది. దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథులు 150 మంది మహిళా సర్పంచ్‌లు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో వారు అద్భుతమైన కృషి చేసినట్లు సమాచారం.
మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, ఛైర్మన్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు.
తూర్పు తీర ప్రాంతంలో సమాంతరంగా మరో కొత్త రైలు కారిడార్‌కు గ్రీన్‌సిగ్నల్ పడింది. ప్రస్తుతం ఉన్న విజయవాడ-విశాఖ-భువనేశ్వర్-కోలకతా రైల్వే కారిడార్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రైలు కారిడార్‌ను కేంద్రం నిర్మించినుంది.
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి నర్తకిగా యామినీ కృష్ణమూర్తి పేరు ప్రఖ్యాతలు గడించారు.
ఏపీలో మరో రాజకీయ సంచలనానికి తెరలేవబోతోందా…? ప్రతిపక్షానికి ఊహించని షాక్ తప్పదా…? ఓ ఎంపీ అధికార కూటమికి అందులోకి వెళ్ళారా? అంతా రెడీ… ఇక గేటు తోసుకుని లోపలికి వెళ్ళడమే మిగిలిందా? అపోజిషన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అధికారపక్షం అట్నుంచి నరుక్కొస్తోందా? ఆ ఎంపీ సైతం స్వామి భక్తికంటే సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యమని భావిస్తున్నారా? ఎవరాయన? ఏంటా కథ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందా? అంటే…. సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందంటున్నారు…
పెళ్లి అనేది జీవితంలో ఒకసారే చేసుకునేది. దీన్ని ఎంతో గ్రాండ్‌గా.. గుర్తుండిపోయేలా ఒక వేడుకగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రపంచమంతా చెప్పుకునేలా అంగరంగ వైభవంగా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో సెక్రటేరియట్, హెచ్వోడీలుగా పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి హెచ్ఆర్ఏ (HRA)ను పెంచింది. ప్రస్తుతం 16 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బేసిక్ పేపై 24 శాతం హెచ్ఆర్ఏ పెంచారు. రూ.25 వేలకు మించకుండా పెంచిన హెచ్ఆర్ఏ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది.